మానవహక్కుల ఉల్లంఘన-మనుషులపై దాడులు కనపడటం లేదా..?
మాజీ ఐపీఎస్ అధికారి షేక్ షావలి తన అనుచరులతో కలిసి టీడీపీలో చేరారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో పసుపు జెండా కప్పుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు....సీఎం వైఎస్ జగన్ అసమర్థ విధానాలపై ఘాటు విమర్శలు చేశారు. రాష్ట్రప్రభుత్వ విధానాలను సమర్థిస్తూ...హైకోర్టు తీరును తప్పుపట్టిన మాజీ న్యాయమూర్తి వ్యాఖ్యలపై చంద్రబాబు పరోక్ష విమర్శలు చేశారు.