Chandrababu Naidu Oath Taking as CM | ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారానికి సర్వం సిద్ధం
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఏపీ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారానికి సర్వం సిద్ధమైంది. రికార్డు స్థాయిలో నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్న చంద్రబాబు కు శుభాకాంక్షలు తెలిపేందుకు ప్రధాని మోదీ స్వయంగా వస్తుండటంతో ఈ సభ ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే చంద్రబాబు ప్రమాణస్వీకారానికి వైసీపీ ఊహించని అతిథులను టీడీపీ తీసుకువస్తోంది..ఎవరు వాళ్లు..ఈ వీడియోలో చూసేయండి.
గత ఐదేళ్లుగా ఆంధ్రప్రదేశ్ విపత్కర పరిస్థితులు ఎదుర్కొందని జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నారు. ఎన్డీయే కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా చంద్రబాబు (Chandrababu) పేరును పవన్ ప్రతిపాదించారు. కష్టాల్లో ఉన్న ఏపీని గాడిన పెట్టేందుకు చంద్రబాబు లాంటి అనుభవజ్ఞుడైన నాయకుడు అవసరం అని చెప్పారు. అనంతరం చంద్రబాబును పవన్ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. విజయవాడ ఏ కన్వెన్షన్ హాలులో మంగళవారం ఎన్డీయే కూటమి ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. చంద్రబాబును ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ తీర్మానాన్ని గవర్నర్కు పంపనున్నారు. ఆయన ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానం పంపనున్నారు. అనంతరం బుధవారం ఉదయం 11:27 గంటలకు ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేస్తారు.