Chandrababu Naidu Elected as TDLP Leader | NDA కూటమి ఎమ్మెల్యేల సమావేశంలో చంద్రబాబు ఏకగ్రీవ ఎన్నిక

NDA కూటమి ఎమ్మెల్యేల సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును టీడీపీ శాసనసభపక్ష నేతగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నకున్నట్లు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటించారు.

గత ఐదేళ్లుగా ఆంధ్రప్రదేశ్ విపత్కర పరిస్థితులు ఎదుర్కొందని జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నారు.  ఎన్డీయే కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా చంద్రబాబు (Chandrababu) పేరును పవన్ ప్రతిపాదించారు. కష్టాల్లో ఉన్న ఏపీని గాడిన పెట్టేందుకు చంద్రబాబు లాంటి అనుభవజ్ఞుడైన నాయకుడు అవసరం అని చెప్పారు. అనంతరం చంద్రబాబును పవన్ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. విజయవాడ ఏ కన్వెన్షన్ హాలులో మంగళవారం ఎన్డీయే కూటమి ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. చంద్రబాబును ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ తీర్మానాన్ని గవర్నర్‌కు పంపనున్నారు. ఆయన ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానం పంపనున్నారు. అనంతరం బుధవారం ఉదయం 11:27 గంటలకు ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేస్తారు.

ఎన్డీయే కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా చంద్రబాబు (Chandrababu) పేరును పవన్ ప్రతిపాదించారు. కష్టాల్లో ఉన్న ఏపీని గాడిన పెట్టేందుకు చంద్రబాబు లాంటి అనుభవజ్ఞుడైన నాయకుడు అవసరం అని చెప్పారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola