రౌడీలను, విద్వేషకారులనే అణిచేశా! మీరెంత: చంద్రబాబు
అధికారంలో ఉన్నప్పుడు రౌడీలను, విద్వేషకారులను అణిచేశా. మీరెంత? తీవ్రవాదులకే భయపడలేదు నేను. నేను మళ్లీ అధికారంలోకి వస్తే రౌడీలు, దాడులు చేసేవాళ్లను అస్సలు వదిలేది లేదు. ఈ గడ్డపైనే మీరు ఉంటారు. మిమ్మల్ని వదలను. నేను ఆగినా కార్యకర్తలు ఆగేలా లేరు. కోడికత్తి కేసు ఏమైంది? తప్పుడు ప్రచారం వైకాపా వాళ్లే చేశారు తప్పు తెలుగుదేశం వాళ్లు ఎక్కడా తప్పుడు ప్రచారం చేయలేదు. కుప్పం ముద్దుబిడ్డ చంద్రబాబు నాయుడని ఎప్పుడూ మీరు గర్వంగా చెప్పేవారు. రాష్ట్రానికే ఆదర్శం కుప్పం.