Chandrababu Naidu At Tadepalli Sit Office: తాడేపల్లి సిట్ కార్యాలయానికి చంద్రబాబు
స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో టీడీపీ అధినేతను ఏ-1గా చేర్చి అరెస్ట్ చేసిన పోలీసులు.... ఎట్టకేలకు ఆయనను తాడేపల్లి సిట్ కార్యాలయానికి తీసుకొచ్చారు. నంద్యాలలో అరెస్ట్ చేసిన తర్వాత సుమారు 6 గంటల పాటు రోడ్డుమార్గంలో ప్రయాణించిన తర్వాత చంద్రబాబు కాన్వాయ్ తాడేపల్లికి చేరుకుంది. దారి పొడవునా ఎక్కడికక్కడ తెలుగుదేశం శ్రేణుల ఆందోళన వల్ల ఇంత ఆలస్యమైనట్టుగా తెలుస్తోంది. తాడేపల్లి సిట్ ఆఫీస్ వద్దకు కాన్వాయ్ చేరుకోగానే అభిమానులు, కార్యకర్తలు ఒక్కసారిగా కార్లను చుట్టుముట్టారు. చంద్రబాబుకు మద్దతుగా నినాదాలు చేశారు.