Chandrababu At Vijayawada CID Office: సీఐడీ కార్యాలయానికి చంద్రబాబు ఎందుకు వెళ్లారు..? ఇదే కారణమా..?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు విజయవాడలోని సీఐడీ కార్యాలయానికి వెళ్లారు. హైదరాబాద్ నుంచి గన్నవరం చేరుకున్న ఆయన.. నేరుగా ఏపీ సీఐడీ కార్యాలయానికి వెళ్లారు. ఇన్నర్ రింగ్ రోడ్డు, మద్యం, ఉచిత ఇసుక కేసుల్లో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరైన విషయం తెలిసిందే. బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు.. దర్యాప్తును ప్రభావితం చేసేలా వ్యాఖ్యలు చేయొద్దని ఆదేశించింది. వారంలోపు రూ.లక్ష చొప్పున ఇద్దరు పూచీకత్తు ఇవ్వాలని తెలిపింది. ఈ క్రమంలోనే ఉచిత ఇసుక కేసులో సీఐడీ అధికారులకు పూచీకత్తు, బాండ్ సమర్పించారు.