Chalo Vijayawada: పోలీసులను దాటుకుంటూ కదంతొక్కిన ఉద్యోగులు | ABP Desam
Continues below advertisement
ఉద్యోగ, ఉపాధ్యాయుల నినాదాలతో విజయవాడ నగరం హోరెత్తింది. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన ఉద్యోగులతో నగర రహదారులు కిక్కిరిశాయి. పోలీసుల ఆంక్షలను ఛేదించుకుంటూ BRTS రోడ్డులోకి దూసుకొచ్చారు. పెద్దఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీగా ముందుకు సాగారు. హక్కులు సాధించుకునేవరకు ఉద్యమాన్ని ఆపే సమస్యే లేదని స్పష్టం చేశారు. అర్ధరాత్రి ఇచ్చిన చీకటి జీవోలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
Continues below advertisement