Chalo Vijayawada : గోడు వినాలంటూ మహిళా ఉద్యోగుల నినాదాలు, విమర్శలు | ABP Desam
విజయవాడ BRTS వద్ద ఉద్యోగులను పోలీసులు అనుమతించకపోవటంతో వారంతా రోడ్డుపైనే బైఠాయించారు. జగన్ గారూ మేం మీ అక్కాచెల్లెళ్లమే అంటూ మహిళా ఉద్యోగులు నినాదాలు చేశారు. పోలీసులు నిలువరించలేనంతగా ఉద్యోగులు వస్తుండటంతో.... సీసీ కెమెరాల ద్వారా మానిటరింగ్ చేస్తున్నారు. పిల్లలకే కాదు... కావాలంటే ప్రభుత్వానికీ పాఠాలు చెప్పగలం అంటూ ఉద్యోగులు చురకలు అంటించారు. సలహాదారుల మాటలు పక్కనపెట్టి తమ గోడు వినాలని కోరారు. పే స్లిప్పులన్నీ ఓ మాయాజాలమన్నారు.