Chalo Vijayawada: మారువేషాల్లో విజయవాడ చేరుకున్న నెల్లూరు ఉద్యోగులు | ABP Desam
Chalo Vijayawada కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు చేస్తున్న ప్రయత్నాన్ని తిప్పికొట్టేందుకు ఉద్యోగులు వినూత్న గెటప్పులు వేస్తున్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరుకు చెందిన ఓ ఉపాధ్యాయుడు పక్షవాత రోగిగా గెటప్ వేసి పోలీసులను తప్పించుకుని రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు. విజయవాడ దాకా వెళ్లిపోయాక... అక్కడ ఆయన కొలీగ్స్ పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. నెల్లూరులోనే మరో ఇద్దరు టీచర్లు కూలీ, పంతులులాగ గెటప్పులు వేసుకున్నారు. కానీ చాలా మందిని పోలీసులు అడ్డుకోగలిగారు. వారంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.