Camphor Eating Woman | Vizianagaram: 70ఏళ్లుగా కర్పూరం తిని బతుకుతున్న మహిళ
ఒక్కపూట ఫుడ్ లేకపోతే ఆకలితో అల్లాడిపోతాం. అలాంటిది 70 ఏళ్లుగా ఆహారం తీసుకోకుండా.. కేవలం కర్పూరం తిని, గుక్కెడు నీళ్లు తాగుతూ జీవించడం అంటే... వినడానికి, నమ్మడానికి చాలా వింతగా ఉంది కదూ. కానీ విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం పెదకాద గ్రామ సమీపంలో ఉంటున్న కర్పూరం పద్మావతిని చూస్తే మాత్రం ఆశ్చర్యం కలగకమానదు.