బైరెడ్డి సిద్దార్డ్ రెడ్డి స్కూబా డైవింగ్ చేస్తూ సీయం జగన్ కు బర్త్ డే విషెస్.
Continues below advertisement
ఏపీ శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్డ్ రెడ్డి సీయం జగన్ కు వినూత్న రీతిలో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.డిసెంబర్ 21 జగన్ పుట్టిన రోజు సందర్భంగా సిద్దార్థ రెడ్డి విశాఖపట్నం లోని ఋషికొండ బీచ్ వద్ద స్కూబా డైవింగ్ చేస్తూ ముఖ్యమంత్రి కి అడ్వాన్స్ గా పుట్టిన రోజు విషెస్ తెలియ జేశారు. రాయలసీమ రాజకీయాల్లోకి వేగంగా దూసుకు వచ్చిన సిద్దార్థ రెడ్డి తనకు తమ్ముడు లాంటి వాడంటూ జగన్ పలుమార్లు పేర్కొన్న విషయం తెలిసిందే. కర్నూల్ జిల్లా రాజకీయాల్లో ఎన్నికల సందర్భంగా కీలక పాత్ర పోషించిన బైరెడ్డి సిద్దార్థ రెడ్డి కి ఇటీవలే ఆంధ్ర ప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ గా బాధ్యతలు అప్పగించారు సీయం జగన్.సిద్దార్థ రెడ్డి చేసిన ఈ లేటెస్ట్ ఫీట్ జగన్ అభిమానులకు క్రొత్త జోష్ ఇచ్చింది.
Continues below advertisement