నగిరిలో ముఖ్యమంత్రి జగన్ పుట్టినరోజు ప్లెక్సీల రగడ..
తిరుపతి , నగిరిలో అధికార పార్టి నేతల మధ్య వివాదం తారా స్ధాయికి చేరుకుంది. కొంతమంది నేతలు రోజా మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు మంటోంది..ఏపి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు రెండు వర్గాల నాయకులు సన్నాహాలు చేస్తున్నారు..ఈ క్రమంలో రోజా ప్రత్యర్ధి వర్గం జగన్ పుట్టిన రోజు సందర్భంగా ప్లెక్సీలను ఏర్పాటు చేసింది.అయితే రాత్రి రాత్రికి ఈ ప్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చింపి వేయడంతో రోజా ప్రత్యర్ధి వర్గాలు మండి పడుతున్నాయి. గత కొద్ది రోజులుగా నగిరిలో సొంత పార్టీ నేతలతోనే పొత్తు కుదరడం లేదు.ఈ క్రమంలో వారం క్రితం రోజా ప్రత్యర్ధి వర్గాలైన ఐదు మండలాలకు చేందిన అధికార పార్టి నేతలు సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను వేరుగా నిర్వహించాలని నిర్ణయించుకున్నారు.