Buddha Venkanna: చంద్రబాబు ఫ్లెక్సీకి రక్తంతో అభిషేకం చేసిన బుద్దా వెంకన్న
విజయవాడలో టీడీపీ కీలక నాయకుల్లో ఒకరైన బుద్దా వెంకన్న, పార్టీ అధనేత చంద్రబాబుపై తనకు ఉన్న విపరీత అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు. రక్తంతో చంద్రబాబు ఫ్లెక్సీకి అభిషేకంచేశారు. ఫ్లెక్సీ కాళ్ల వద్ద తన రక్తాన్ని అభిషేకంగా ధారపోశారు. ఇది నిరసన కాదని, చంద్రబాబు మీద అభిమానంతోనే ఇలా చేస్తున్నానని, ఆయన అధికారంలోకి రావాలని కోరుకుంటున్నట్టు బుద్దా వెంకన్న తెలిపారు. అలాగే విజయవాడ పశ్చిమ నియోజకవర్గ టికెట్ తనకు కేటాయించాలని మరోసారి మనవి చేస్తున్నానన్నారు.