Buddha Venkanna Challenge Aara Mastan | ఆరా మస్తాన్ ది ఫేక్ సర్వే అన్న టీడీపీ నేత బుద్ధా వెంకన్న

Continues below advertisement

వైసీపీ మరోసారి ఘన విజయం సాధిస్తుందని ఆరా సంస్థ వెల్లడించిన సర్వేపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఫైర్ అయ్యారు. బెట్టింగ్ ల కోసమే ఆరా మస్తాన్ ఫేక్ సర్వే విడుదల చేశారన్న వెంకన్న..వైసీపీ గెలుస్తుందన్న వాళ్ల సర్వే నిజమైతే ఇలా చేద్దామంటూ ఓ సవాల్ విసిరారు.

 

విజయవాడలో బుద్ధా వెంకన్న ఆదివారం నాడు మీడియాతో మాట్లాడుతూ.. ఆరా మస్తాన్ వైసీపీ గెలుస్తుందని ఫేక్ ఎగ్జిట్ పోల్స్ విడుదల చేశారని మండిపడ్డారు. వైసీపీ చెప్పినట్లు ఆరా మస్తాన్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఇచ్చారని ఆరోపించారు. ఒకవేళ ఏపీలో కూటమి అధికారంలోకి రాకపోతే తాను నాలుక కోసుకుంటా అన్నారు. ఒకవేళ కూటమి ప్రభుత్వం ఏర్పడితే ఆరా మస్తాన్ నాలుక కోసుకుంటాడా అని బుద్ధా వెంకన్న సవాల్ విసిరారు. ఎలాగూ ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసిన వైసీపీ నేతలు బెట్టింగ్ కాయటానికి ఫేక్ ఎగ్జిట్ పోల్స్ ప్రకటనలు ఇచ్చి ప్రజలతో మైండ్ గేమ్ ఆడుతున్నారని ఆరోపించారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram