Breaking News | YSRCP Twitter Account Hacked: హ్యాకింగ్ కు గురైన వైసీపీ ట్విట్టర్ అకౌంట్
Continues below advertisement
వైఎస్సాఆర్సీపీ అఫీషియల్ ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయింది. 13 గంటల క్రితం సీఎం జగన్ మీటింగ్ కు సంబంధించి ఆఖరి పార్టీ సంబంధిత ట్వీట్ ఉంది. ఆ తర్వాత అన్నీ అర్థం లేని ట్వీట్స్ కనిపిస్తున్నాయి. అయితే క్రిప్టో కరెన్సీని సపోర్ట్ చేసేందుకు ఎలన్ మస్క్ ఫ్రీ బిట్ కాయిన్స్ ఇచ్చేస్తున్నారనే ట్వీట్ మాత్రం పిన్ చేసిం ఉంది. అది టాప్ లో కనిపిస్తోంది. దాని తర్వాత అమెరికా కల్చర్ కు దగ్గరగా ఉండే అనేక ట్వీట్లను వైసీపీ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ రీట్వీట్ చేసినట్టుగా చూపిస్తోంది.
Continues below advertisement