షర్మిల డ్రామా వెనుక పెద్ద కుట్ర, నీలాంటి చెల్లి ఉన్నందుకు మాకు బాధ - భూమన
‘‘జగన్ లాంటి నాయకుడు రాజకీయాల్లో చాలా అరుదు. ఇచ్చిన మాటకు వెనుకంజ వేయకుండా సర్వం త్యాగం చేయడానికి సిద్ధపడ్డ వ్యక్తి జగన్. 2009 లో సోనియాకు లొంగి వుంటే ఇప్పుడు పరిస్థితులు మరోలా ఉండేవి. రాజశేఖర్ రెడ్డి మరణాంతరం చనిపోయిన 673 మంది కుటుంబ సభ్యులను ఓదార్చడానికి సోనియా గాంధీని వీరోచితంగా వెళ్ళిన వ్యక్తి జగన్. అప్పుడే జగన్ వ్యక్తిత్వం ఏమిటో ప్రజలకు తెలిసింది. కోట్లాది మంది రాజశేఖర్ రెడ్డి అభిమానులందరూ జగన్ వైపు నిలబడ్డారు. 2014 ఎన్నికల్లో పార్టీ నాయకులు అంతా రైతులకు రుణమాఫీ మ్యానిఫెస్టోలో పెట్టమన్నా సాధ్యంకాదని పెట్టకుండా రాజకీయాల్లోకి వెళ్ళిన వ్యక్తి జగన్. 2024 లో చంద్రబాబు ఎన్ని అపద్దపు హామీలు ఇచ్చారు..జగన్ అలా ఇవ్వలేదు.
జగన్ ఒక యుద్ధ వీరుడు. జగన్ ఓడిపోయినా ప్రజలంతా ఆయన వెనకే ఉన్నారు. తెలంగాణకు వెళ్లి షర్మిల అక్కడ మభ్య పెట్టే రాజకీయాలను చేసి ఏపీకి మార్చినా ఏ ఒక్క రాజశేఖర్ రెడ్డి అభిమాని ఆమె వెనుక లేరు. షర్మిల చంద్రబాబుకి నేరుగా మద్దతు పలికే విధంగా ప్రవర్తించారు. జగన్మోహన్ రెడ్డి తన స్వార్జిత ఆస్తిలోనించి 40 శాతం మీకు ఇస్తానని మాట ఇచ్చారు. జగతి పబ్లికేషన్స్ అవన్నీ కూడా ఈడీ అటాచ్ మెంట్ లో వున్నాయి. షర్మిల పెళ్లి అయిన 20 సంత్సరాలకు జగన్ మీకు ఇవ్వడానికి సిద్ధపడితే..జగన్ వి వ్యక్తిగత ఆస్తులు కాదు ఉమ్మడి ఆస్తులు అని చంద్రబాబు అనుకూల మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారు. మీలాంటి చెల్లి జగన్మోహన్ రెడ్డికి ఉండటం మాకు చాలా బాధ కలుగుతోంది. రాజశేఖర్ రెడ్డి బిడ్డగా మీమీద అభిమానం ఉంది. 49 సంవత్సరాలుగా ఆ కుటుంబంతో ఉన్న ఆవినాభావ సంబంధం వల్ల మాట్లాడుతున్నాను. రాజశేఖర్ రెడ్డి పేరునే పూర్తిగా తుడిచి వేసే విధంగా చేస్తున్న టిడిపికి షర్మిల వత్తాసు పలకడం సరికాదు. జగన్మోహన్ రెడ్డి ఎటువంటి చిన్న తప్పు చేయలేదు
షర్మిల తప్పు చేసి జగన్ సరస్వతి షేర్స్ ని అమ్మ పేరు మీద గిఫ్ట్ గా రాస్తే తల్లి అమాయకత్వాన్ని వాడుకొని జగన్ బెయిల్ ను రద్దు చేసేప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు కుట్రలో షర్మిల భాగస్వాములయ్యారు. ప్రజల మధ్యకు వచ్చి ఏడుపులు ఏడుస్తూన్నారు. షర్మిల రాసినటువంటి లెటర్లు, ఎం ఒయూలు ఆన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ఏ రకంగా వాళ్ళ వెబ్సైట్లో ఉంచుతున్నది? ప్రజలకు చెప్పే కన్నాముందే టీడీపీకి లీకేజ్ చేస్తున్నారు. ఇదంతా షర్మిల కుట్రే. చంద్రబాబు తప్పుడు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చి ఒక్క వాగ్దానాలు నెరవేర్చలేదు. ప్రతినెల ఏదో ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు’’ అని భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడారు.