నేనింకా ఎందుకు బతికున్నానని నా తల్లి వేదన, ప్రెస్ మీట్‌లో ఏడ్చేసిన షర్మిల

Continues below advertisement

YS Sharmila Comments on YS Jagan: ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) విజయవాడలోని ఆంధ్రరత్న భవన్‌లో (AP Congress Latest News) ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా తన సోదరుడు వైఎస్ జగన్‌తో నడుస్తున్న వివాదం గురించి మాట్లాడారు. తన తండ్రి ఉండగా.. సాక్షి మీడియా సంస్థలో వాటాలు కూడా తనకు చెందుతాయని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ షేర్లు తనకు బదిలీ చేసేందుకు అప్పట్లో జగన్ వైఎస్ కు మాట కూడా ఇచ్చారని గుర్తు చేసుకున్నారు. ‘‘అలాంటి కొడుకును చిన్నప్పుడే చంపాలని అనుకోవడం లేదు. కానీ, ఇలాంటి కొడుకును చూసి నేనింకా ఎందుకు బతికి ఉన్నానని నా తల్లి అనుకుంటుంది. జగన్ నాకు అన్యాయం చేయడం పచ్చి నిజం’’ అని వైఎస్ షర్మిల (YS Sharmila) కన్నీటి పర్యంతం అయ్యారు. వైసీపీలో మరే నేత మాట్లాడినా తాను ఇంతలా స్పందించేదాన్ని కానని.. తన చిన్నాన్న పచ్చి అబద్ధాలు చెప్పడంతోనే తనకు కన్నీళ్లు వస్తున్నాయని షర్మిల అన్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram