నేను మంచిదాన్ని కాదు, ఆ 100 మంది లెక్కలు తేలుస్తా - వైసీపీ నేతలకు భూమా అఖిలప్రియ వార్నింగ్

ఏపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ వైసీపీ నేతలపై ఫైర్ అయ్యారు. అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నేతల్ని దారుణంగా ఇబ్బంది పెట్టారని, అంతకు అంత అనుభవించి తీరతారని వార్నింగ్ ఇచ్చారు. తాను మంచి దాన్ని కాదని, కచ్చితంగా అందరి లెక్కలూ తేలుస్తానని తేల్చి చెప్పారు. తన వద్ద కూడా రెడ్‌ బుక్ ఉందని, 100 మంది వైసీపీ నేతలకు ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి ఎంత హింసించారో గుర్తు పెట్టుకున్నానని అన్నారు. తప్పు చేసిన వాళ్లే భయపడాలని, మిగతా వాళ్లంతా ప్రశాంతంగా ఉండాలని సెటైర్లు వేశారు. ఇందులో రహస్యం ఏమీ లేదని, తప్పు చేసిన వైసీపీ నేతలను ఇబ్బంది పెట్టి తీరతానని వెల్లడించారు. ఇబ్బంది పెట్టడం అంటే కొట్టడం, వేధించడం కాదని..లీగల్‌గా యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. వైసీపీ అరాచకాలు బయటపెట్టి, ఆధారాలు చూపించి మరీ కచ్చితంగా చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని అన్నారు. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola