Bamboo Chicken: ఏజెన్సీ పల్లెల్లో జీవనోపాధిని.. ప్రత్యేక వంటకం బ్యాంబూ చికెన్
దట్టమైన అటవీ ప్రాంతం... కల్మషం లేని మనసులు. అలా ఆ రోడ్డు వెళ్తుంటే... నోరూరిపోయే ఘుమఘుమలు మనసు లాగేస్తాయి. రంపచోడవరం వెళ్తే చాలు బ్యాంబూ చికెన్ తినే రావాలి. అంతెందుకు మారేడుమిల్లి ఎంటర్ అవుతూనే రోడ్ కి ఇరు వైపులా బ్యాంబూ చికెన్ తయారు చేసి అమ్మే షాపులు పదుల సంఖ్యలో దర్శనమిస్తాయి.