Balakrishna Hindupur Tour : పోచనపల్లి వంతెనను చూసేందుకు వెళ్లిన బాలకృష్ణ షాక్ | DNN | ABP Desam
శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం మండలం పోచనపల్లి వంతెను వరదకు తెగిపోయింది. దాన్ని చూసేందుకు వెళ్లిన ఎమ్మెల్యే బాలకృష్ణను కలిసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున వచ్చారు. తెగిపోయిన బ్రిడ్జి మీద ప్రమాదకరంగా నిలబడి బాలయ్యను చూశారు. ఎమ్మెల్యే వంతెనను పరిశీలిస్తున్న టైం లో ఓ అభిమాని బాలయ్యను కలిసేందుకు వరద ఉద్దృతిలోకి దూకేయటం కలకలం రేపింది. ప్రమాదకర స్థితిలో కొట్టుకెళ్లిన అభిమాని అదృష్టవశాత్తు ఒడ్డుకు చేరుకున్నాడు. అభిమానం సంగతి అటుంచితే...ఇంత రిస్క్ చేసిన ఉప్పర నాగరాజును బాలయ్య సహా అక్కడున్న వారంతా మందలించారు.