JC Prabahakar Reddy vs Pedda Reddy | Tadipatri Tension | తాడిపత్రిలో కౌంటింగ్ రోజు ఏం జరగనుంది..?

ఎన్నికల సందర్భంగా గొడవలు అల్లర్లు పై నమోదైన పలు కేసుల్లో నిందితులుగా ఉన్న టిడిపి వైసిపి నేతలకు హైకోర్టు ఊరటను ఇచ్చింది. తాడపత్రి నియోజకవర్గంలో సాధారణ ఎన్నికల సందర్భంగా చెల్లరేగిన హింసాత్మక ఘటనలపై రాష్ట్రవ్యాప్తంగా సంచలనగా మారింది. ఈ అల్లర్లలో కూటమి అభ్యర్థి తెలుగుదేశం పార్టీ నేత జెసి అస్మిత్ రెడ్డి, వైసిపి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పై పోలీసులు నమోదు చేశారు. ముందస్తుగా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఉన్న నేపథ్యంలో తమను పోలీసులు అరెస్టు చేయకుండా రక్షణ కల్పించాలని జేసీ అస్మి త్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.   ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫున న్యాయవాదులు జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ ఉన్న దృష్ట్యా దానికి ముందు పోటీ చేసిన అభ్యర్థులు ఏజెంట్లను నియమించుకోవాల్సి ఉంటుందని వారిని అరెస్టు చేస్తే వారి హక్కులకు భంగం కలుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా వారికి మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని వివరించారు.  అభ్యర్థులు కౌంటింగ్ సందర్భంగా మరికొన్ని గొడవలు సృష్టించే ప్రమాదం ఉందని పబ్లిక్ ప్రాసిక్యూట్ నాగిరెడ్డి తన వాదనలు వినిపించారు. మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోర్టు భావిస్తే కఠిన షరతులు విధించాలన్నారు. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola