గుంటూరు జిల్లా కొప్పర్రులో మాజీ జడ్పీటీసీ ఇంటిపై దాడి.. పెట్రోల్ పోసి నిప్పంటించి..
Continues below advertisement
గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం కొప్పర్రులో టీడీపీ నేత, జడ్పీటీసీ మాజీ సభ్యురాలు బత్తిని శారద ఇంటిపై వైసీపీ కార్యకర్తలు అర్ధరాత్రి రాళ్లతో దాడిచేశారు. ఇంట్లోకి ప్రవేశించి సామగ్రిని ధ్వంసం చేసి, ఇంట్లోని వస్తువులతోపాటు ఆరు బైకులపై పెట్రోలు పోసి నిప్పంటించినట్టు చెబుతున్నారు. వినాయక నిమజ్జనం సందర్భంగా గత అర్ధరాత్రి వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఆ తర్వాత రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు శారద ఇంటిపైకి దాడి దిగినట్టు తెలుస్తోంది. దాడి జరిగిన సమయంలో పోలీసులు అక్కడే ఉన్నా పట్టించుకోలేదని బాధితులు ఆరోపించారు. ఎలాంటి కారణం లేకుండానే తమ ఇంటిపై దాడికి దిగారని శారద ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Continues below advertisement