కడపలో డమ్మీ ఏటిఎం కార్డులతో మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్..!|
సైబర్ నేరగాడి గుట్టు రట్టు చేశారు కడప జిల్లా పోలీసులు. ఏ.టి.ఎం లో నగదు విత్ డ్రా చేసే సమయంలో సహాయం చేసే నెపంతో ఎటీయం కార్డులను తారుమారు చేసి, లక్షల్లో దోచుకున్న సైబర్ నేరగాడు చిత్తూరు జిల్లా రంగన్న గారి గడ్డకు చెందిన పాలగిరి మహమ్మద్ రియాజ్ (43) అరెస్ట్ చేసినట్లు తెలిపారు కడప జిల్లా ఎస్పీ అన్బు రాజన్.21 డమ్మీ ఎటీఎం కార్డులు, 3.40 లక్షల నగదు స్వాధీనం.