డాక్యుమెంట్ రైటర్ల పై ప్రభుత్వం నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్
డాక్యుమెంట్ రైటర్ల పై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు అనంతపురం రైటర్లు.సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లోకి రైటర్లు రాకుడదంటూ రిజిస్ట్రేషన్ ఐజి రామకృష్ణ తీసుకొన్న నిర్ణయం పట్ల డాక్యుమెంట్ రైటర్లు మండిపడుతున్నారు. ఈ వృత్తి పై లక్ష మంది దాకా ఆధారపడి జీవిస్తూ ఉన్నారని,మా అందరి పొట్ట కొట్టద్దు అంటూ ప్రభుత్వానికి విన్నవించుకున్నారు.ప్రభుత్వం నిర్ణయాన్ని పునరాలోచన చేయకపోతే న్యాయస్థానం కి వెళ్లాల్సిన పరిస్థితి వస్తోందన్నారు.