యానాంలో మత్య్సకారుల వేటలో చిక్కిన ఏషియన్ సీ బాస్
సముద్రంలో లేదా గోదావరిలో దొరికే పండుగప్పలు 3 నుంచి 4 కేజీల వరకూ బరువు ఉంటాయి.. మీరు చూస్తున్న ఈ పండుగప్ప మాత్రం ఏకంగా 16 కిలోలు తూగింది.తూర్పు గోదావరి జిల్లా పరిధిలోని పుదుచ్చేరి యానాంలో భారీ పండుగప్ప మత్సకారులకు వలకు చిక్కింది. పండుగప్ప రుచికరమైన వంటకం కాగా రేట్లు కూడా ఎక్కువగానే పలుకుతాయి. కిలో బరువు ఉండే పండుగప్ప సుమారు 1500 రూపాయలు దాటి ఉండే అవకాశాలు ఉంటాయి.. అటువంటిది 16 కిలోల పండుగప్ప వలలో పడటంతో స్థానిక మత్యకారులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. యానాం ఇందిరాగాంధీ మార్కెట్‌కు ఈ పెద్ద చేపను విక్రయానికి తెచ్చారు. ఇక్కడ నిర్వహించిన వేలంపాటలో రూ. ఎనిమిది వేలకు చేపల వ్యాపారస్తుడు పోనమండ భద్రం, రత్నం దంపతులు అత్యధికంగా పాడి ఈ చేపను దక్కించుకున్నారు. ఇంత పెద్ద పండుగప్ప చేప దొరకడం చాలా తక్కువ అని మత్యకారులు చెప్తున్నారు. సీమలోని గౌతమి, వశిష్ఠ, వైనతేయ గోదావరి పాయల్లో ఎక్కువగా దొరికే ఈ పండుగప్పలను ఏషియన్ సీ బాస్ అని కూడా పిలుస్తారు.