Asani Cyclone Update: మే 12 నాటికి మరింత బలహీనపడి వాయుగుండంగా మారనున్న అసని | ABP Desam
బంగాళాఖాతంలో Asani.... తీవ్ర తుపాను నుంచి తుపానుగా బలహీనపడింది. మే 12 ఉదయానికి ఇది మరింత బలహీనపడి వాయుగుండంగా మారనుంది. గత కొన్ని గంటల్లో గంటకు 12 కిలోమీటర్ల వేగంతో ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదిలింది. రాబోయే కొన్ని గంటల్లో వాయవ్య దిశగా ప్రయాణించి ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి చేరుకునే అవకాశముంది. ఈ రోజు కోస్తాంధ్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు, అక్కడకక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశముంది. తీరం వెంట గంటకు 75 నుంచి 95 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
Tags :
Andhra Pradesh Rains Asani Cyclone Asani Cyclone Update Bay Of Bengal Asani Rains In Andhra Pradesh