Asani Cyclone Rains: అసని తుపాను ప్రభావంతో ఏపీలో చాలా జిల్లాల్లో వర్షాలు | ABP Desam
Asani తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చాలా చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. పార్వతీపురం మన్యం జిల్లాలో ఉదయం నుంచి భారీ వర్షం పడుతోంది. ప్రజలందరూ దాదాపుగా ఇళ్లకే పరిమితమయ్యారు. అసని తుపానును దృష్టిలో ఉంచుకుని ఇవాళ జరగాల్సిన ఇంటర్ పరీక్ష వాయిదా పడింది. భారీ వర్షాలకు చాలా చోట్ల రోడ్లు జలమయమయ్యాయి. భారీ గాలులకు చాలా చోట్ల చెట్లు నేలకూలాయి. వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలిగింది. తుపాను సమయంలో ఎలాంటి సాయానికైనా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు.
Tags :
Asani Cyclone Asani Cyclone Effect Rains In Andhra Pradesh Rains In ParvathiPuram Parvathipuram Rains