YS Sharmila Kadapa: APCC చీఫ్ గా ప్రమాణం చేసేముందు కడప జిల్లాలో షర్మిల
Continues below advertisement
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కడప జిల్లాకు చేరుకున్నారు. పార్టీ అధ్యక్షురాలిగా నియమితులయ్యాక షర్మిల తొలిసారిగా కడపకు చేరుకున్నారు. 21వ తేదీన షర్మిల ఏపీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఆమేరకు ప్రమాణం చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రమాణానికి ముందు ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ కు చేరుకుని తండ్రికి నివాళులు అర్పించేందుకు కడపకు వచ్చారు. విమానాశ్రయం వద్ద షర్మిలకు ఘనస్వాగతం లభించింది. జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు తులసిరెడ్డి సహా ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు గజమాలతో స్వాగతం పలికారు.
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement