AP PRC Fitment decission made: ఎన్నాళ్లగానో వేచిచూస్తున్న ఏపీ పీఆర్సీ- ఫిట్‌మెంట్ ఖరారు | ABP Desam
ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు పే రివిజన్ కమిషన్ సిఫార్సుల మేరకు ప్రభుత్వం ఎంత ఫిట్‌మెంట్ ఇస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎంత ఫిట్‌మెంట్ ఇస్తే ఎంత పెరుగుతుంది అని లెక్కలు వేసుకుంటున్నారు. అయితే ప్రభుత్వంలోని అత్యంత విశ్వసనీయవర్గాలు ఏబీపీదేశంకు అందించిన సమాచారం ప్రకారం ఉద్యోగులకు 34 శాతం ఫిట్‌మెంట్‌ను ప్రభుత్వం ఖరారు చేసింది. సోమవారం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించబోతున్నట్లుగా తెలుస్తోంది.