TDP leader Nara Lokesh: పోలీసుల అదుపులో నారా లోకేశ్... తన పర్యటనను అడ్డుకోవడంపై లోకేశ్ ఆగ్రహం
Continues below advertisement
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ను గన్నవరం ఎయిర్ పోర్టులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల తీరుపై టీడీపీ నేతలు, కార్యకర్తలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇవాళ లోకేశ్ నరసరావుపేట పర్యటనపై సర్వత్రా టెన్షన్ నెలకొంది. తెల్లవారుజాము నుంచే గుంటూరు జిల్లాలో టీడీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పోలీసులు అదుపులోకి తీసుకున్నాక పోలీస్ వ్యాన్ నుంచే లోకేశ్ మీడియాతో మాట్లాడారు.
‘నా పర్యటనను ఎందుకు అడ్డుకుంటున్నారో తెలియట్లేదు. నేను ధర్నాలు, ఆందోళనలు చేయడానికి వెళ్లట్లేదు. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్నాను. బాధిత కుటుంబాన్ని పరామర్శించి వస్తా. పరామర్శకు వెళ్తుంటే పోలీసులు కావాలనే అడ్డుకుంటున్నారు. ఏది తప్పో ఏది ఒప్పో నాకు తెలుసు. నాపై ఎలాంటి కేసులు లేవు’ అని నారా లోకేశ్ చెప్పుకొచ్చారు.
Continues below advertisement