AP Loksabha Exit Poll 2024 | ఏపీలో ఏ పార్టీ ఎన్ని ఎంపీ సీట్లు గెలుస్తుందంటే?

ఏబీపీ సీ ఓటర్ ఎగ్జిట్ పోల్స్ గణాంకాలు చూస్తే ఏపీలో ఎన్డీయేకి 21 నుంచి 25 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 0 నుంచి 4 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. అంటే లాస్ట్ ఎన్నికల్లో 3 స్థానాలకే పరిమితమైన టీడీపీ...బీజేపీ, జనసేనలతో కలిసి కూటమిగా వెళ్లి ఈసారి 21 నుంచి 25స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని ఏబీపీ సీ ఓటర్ పోస్ట్ పోల్ సర్వేలో తేలింది. గత ఎన్నికల్లో 22 పార్లమెంటు స్థానాలు కైవసం చేసుకున్న వైసీపీ మాత్రం ఈసారి 0 నుంచి 4 స్థానాలకు మాత్రమే పరిమితమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇక ఓట్ షేరింగ్ విషయానికి వస్తే ఏపీలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి అత్యధికంగా 52.9 శాతం ఓట్లు సాధిస్తుందని ఏబీపీ న్యూస్ - సీ ఓటర్ ఎగ్జిట్ పోల్ లో వెల్లడైంది.  వైఎస్ఆర్‌సీపీకి 41.7  శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉంది. అలాగే వైఎస్ షర్మిలా రెడ్డి కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని కొంత మెరుపరిచారు. గత ఎన్నికల్లో ఒక్క శాతం కన్నా తక్కువే ఓట్లు వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈ సారి మెరుగైన ఓట్లు సాధించబోతోంది. ఈ సారి కాంగ్రెస్ కు 3.3 శాతం ఓట్లు వస్తాయని ఏబీపీ - సీఓటర్ ఎగ్జిట్ పోల్ లో వెల్లడైంది. కానీ కడప ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తున్న వైఎస్ షర్మిల గెలిచే పరిస్థితి రావట్లేదు. ఇతరులకు 2.1 శాతం ఓట్లు సాధించే అవకాశాలు ఉన్నాయి. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola