AP Govt Employees Association: ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోంది..మేం రాజ్యంగంలో భాగమే| ABP Desam

విజయవాడ ఎన్జీవో కార్యాలయంలో పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉద్యోగ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అన్ని జిల్లాలకు చెందిన ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల నేతలు పాల్గొన్నారు. పీఆర్సీ జీవోలను రద్దు చేయాలని నేతలు పునరుద్ఘాటించారు. ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇవ్వనున్న నేపథ్యంలో ఉద్యమ కార్యాచరణపై రౌండ్ టేబుల్ సమావేశంలో చర్చించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ లక్ష్మణరావు, ఎన్ జి ఓ సంఘ నాయకుడు ఎ. విద్యాసాగర్ మాట్లాడుతూ పీడీఎఫ్ తరఫున ఉద్యోగ సంఘాల ఆందోళనకు మద్దతిస్తున్నట్లు చెప్పారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola