Amaravathi Farmers Maha Padayatra : కాలికి గాయం‌ కావడంతో యాత్ర రధంలో కూర్చున్న నారాయణ

Continues below advertisement

37వ రోజుకు చేరిన అమరావతి రైతుల పాదయాత్రకు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ మద్దతు ఇచ్చారు.. చింతపాళ్యం నుండి ప్రారంభంమైన అమరావతి మహా‌పాదయాత్రలో‌ భాగస్వామ్యం అయిన సీపిఐ నారాయణ కాలికి గాయం‌కావడంతో యాత్ర రధంలో కూర్చున్నారు. ఆరు గ్రామాల మీదుగా శ్రీకాళహస్తి పట్టణం వరకూ ఈ పాదయాత్ర కొనసాగనుంది.దాదాపు 14 కిలోమీటర్లు వరకూ ఈ పాదయాత్ర కొనసాగనుంది..ఇవాళ రాత్రి శ్రీకాళహస్తిలో బస చేసి రేపు ఉదయం తిరిగి పాదయాత్ర కొనసాగనుంది.. అమరావతిని రాజధానికి కొనసాగించాలంటూ కోరుతూ నిర్వహిస్తున్న ఈ పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరధం పడుతున్నారు..అయితే అమరావతి రైతులకు శ్రీవారి దర్శన టిక్కెట్ల మంజూరు విషయంపై టిటిడి ఇప్పటి వరకూ క్లారిటీని ఇవ్వలేదు. జై అమరావతి జై అమరావతి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ పాదయాత్ర కొనసాగుతుంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram