Krishna : రూ.2 కోట్ల లిక్కర్... తొక్కిపడేశారు..!| ABP Desam
కృష్ణాజిల్లా నున్న మామిడి మార్కెట్ వద్ద పోలీసులు భారీగా లిక్కర్ ను ధ్వంసం చేశారు. పోలీసు కమీషనర్ కాంతిరాణా టాటా ఆధ్వర్యంలో మొత్తం 62వేల 500 మద్యం బాటిళ్ళు ధ్వంసం చేశామన్నారు. 8877 అక్రమ మద్యం కేసులు నమోదు చేశామంటున్న పోలీసులు NTR జిల్లాలో మైలవరం, తిరువూరు, విస్సన్నపేట ల్లో నాటు సారా తయారీపై 4 పీడీ యాక్ట్ కేసులు పెట్టినట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న మద్యం సీసాలను రోడ్ రోలర్ తో తొక్కించి ధ్వంసం చేశారు.