CM Chandrababu Naidu AT Tirumala | Nara Lokesh | తిరుమలలో దర్శనానికి వెళ్తున్న సీఎం చంద్రబాబు

Continues below advertisement

నాలుగో సారి సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన చంద్రబాబు... తిరుమలకు వచ్చారు. కుటుంబ సమేతంగా ఆయన తిరుమలకు రాగానే... అధికారులు ఘనస్వాగతం పలికారు. ఈరోజు ఉదయం ఆయన కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శనానికి వెళ్లారు.

రాష్ట్రంలో తిరుమల నుంచే ప్రక్షాళన మొదలుపెడతానని సీఎం చంద్రబాబు అన్నారు. 'గత ఐదేళ్లలో తిరుమలలో చెయ్యని అరాచకం లేదు. తిరుమలను ధనార్జన కేంద్రంగా మార్చారు. విపరీతమైన రేట్లు, బ్లాక్ మార్కెట్‌లో టికెట్ల విక్రయించే పరిస్థితి ఉండేది. గంజాయి, అన్యమత ప్రచారం, మద్యం, మాంసం అంటూ విచ్చలవిడిగా గత ప్రభుత్వం వ్యవహరించింది. ఇష్టానుసారంగా తమకు నచ్చిన వారికి పదవులు ఇచ్చారు. ఎర్ర చందనం స్మగ్లర్లలు సీట్లు ఇచ్చారు. దృఢ సంకల్పంతో చెడును అణచి వేస్తా. తిరుమల కొండపై అపచారం చేసిన వాళ్లు ఈ జన్మలోనే శిక్ష అనుభవిస్తారు. మంచిని ప్రోత్సహిస్తా.. రౌడీయిజాన్ని అణచివేస్తా. మన రాష్ట్రం, దేశంలోనే కాకుండా ప్రపంచంలో కూడా శ్రీవారి ఆలయాలు నిర్మించే విదంగా ముందుకు వెళ్తాం. పేదరికం లేని సమాజాన్ని నిర్మించేందుకు ప్రయత్నిస్తా. నా పర్యటనలోనూ పరదాలు కడుతున్నారు. వాటిని తొలగించాలని అధికారులను ఆదేశించాను. గత వైసీపీ హయాంలో టీడీపీలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి. హైదరాబాద్ ని 1.0 విజన్ తో అభివృద్ధి చేశా. అప్పుడు చేసిన అభివృద్ధిని చూసి ప్రపంచంలోని దేశధినేతలు హైదరాబాద్‌కు వచ్చారు.  శ్రీవారి సమక్షంలో చెబుతున్నా.. నేను 5 కోట్ల ప్రజల మనిషిని. ఇకపై పరదాలు, నియంత్రణ ఉండదు. నేటి నుంచి ప్రజా పాలన ప్రారంభమైంది.' అని చంద్రబాబు పేర్కొన్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram