CM Chandrababu Naidu AT Tirumala | తిరుమలకు చేరుకున్న సీఎం చంద్రబాబు కుటుంబం
నాల్గోవ సారి సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన చంద్రబాబు... తిరుమలకు వచ్చారు. కుటుంబ సమేతంగా ఆయన తిరుమలకు రాగానే... అధికారులు ఘనస్వాగతం పలికారు. రేపు ఉదయం ఆయన శ్రీవారిని దర్శించుకోనున్నారు.
దేశంలోనే ఏపీని నెంబర్ వన్ స్థానంలో నిలబెడతానని సీఎం చంద్రబాబు (CM Chandrababu) అన్నారు. గురువారం ఉదయం ఆయన సీఎం హోదాలో తొలిసారిగా తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. గతంలో ఎన్నో ఎన్నికలు చూశామని.. ఈ ఎన్నికల్లో ప్రజలు కూటమికి చారిత్రాత్మక విజయాన్ని అందించి మంచి తీర్పు ఇచ్చారని చెప్పారు. తిరుమల వేంకటేశ్వర స్వామి తన కులదైవమని.. ఆయన ఆశీస్సులు, ప్రజల ఆశీర్వాదంతోనే విజయం సాధించామని అన్నారు. 'నేను ఏ సంకల్పం తీసుకున్నా ముందు శ్రీవారిని దర్శించుకుంటాను. ప్రతిరోజూ ఉదయం నిండు మనస్సుతో ఒక్క నిమిషం ఆ వెంకటేశ్వుని ప్రార్థిస్తాను. రాష్ట్రంలో ప్రజా పాలన మొదలైంది. గతంలో అలిపిరి వద్ద నాపై క్లైమోర్ మైన్స్ దాడి జరిగినప్పుడు ఆ వెంకటేశ్వర స్వామే నన్ను రక్షించారు. రాష్ట్రంలో ఆర్థిక అసమానతలు తొలిగి పేదరికం లేని రాష్ట్రంగా మారాలి. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆ స్వామిని వేడుకున్నా. ఇప్పుడు సంపద సృష్టించడమే కాదు పేదలకు అందించడమే నా ప్రధాన లక్ష్యం.' అని చంద్రబాబు స్పష్టం చేశారు.