AP CEO Mukesh Kumar Meena on EVMs Damage | పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనపై ఏపీ ఎన్నికల అధికారి

మాచర్ల నియోజకవర్గంలోనే ఏడు ఈవీఎంలను ధ్వంసం చేశారని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్ కుమార్ మీనా స్పష్టతనిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 9చోట్ల ఈవీఎంలను ధ్వంసం చేస్తే...ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నియోజకవర్గంలోనే 7మెషిన్లను పగులగొట్టారన్నారు.

 

మాచర్ల నియోజకవర్గంలోనే ఏడు ఈవీఎంలను ధ్వంసం చేశారని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్ కుమార్ మీనా స్పష్టతనిచ్చారు. దేశ వ్యాప్తంగా ఈవీఎంల ధ్వంసం వీడియో వైరల్ కావడంతో కేంద్ర ఎన్నికల సంఘం కూడా స్పందించింది. రాష్ట్ర సీఈవోకు నోటీసులు పంపింది. సాయంత్రం ఐదు గంటలలోపు నిందితులను అరెస్టు చేసి నివేదిక పంపాలని ఆదేశించింది. పిన్నెల్లిని అరెస్టు చేయకపోతే పోలీసు వ్యవస్థ విఫలమైనందన్న తీవ్ర విమర్శలు వస్తాయి. రాష్ట్రవ్యాప్తంగా 9చోట్ల ఈవీఎంలను ధ్వంసం చేస్తే... ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నియోజకవర్గంలోనే 7మెషిన్లను పగులగొట్టారన్నారు. మాచర్ల నియోజకవర్గంలో ఈవీఎంల ధ్వంసం కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏ వన్ గా ఉన్నారు. ఆయన ఈవీఎంలను ధ్వంసం చేసిన వీడియోలు వైరల్ కావడం..  ఇప్పటి వరకూ చర్యలు తీసుకోకపోవడం వివాదాస్పదమయింది. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola