AP CEO Mukesh Kumar Meena on AP Election | పిన్నెల్లికి ఏ శిక్ష పడొచ్చో చెప్పిన ఏపీ ఎన్నికల అధికారి
మాచర్ల నియోజకవర్గంలో ఈవీఎంను స్వయంగా పగులగొట్టిన వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేస్తామన్నారు ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్ కుమార్ మీనా. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఆయన్ను నిందితుడిగా నిర్ధారించామన్న సీఈవో పదిసెక్షన్లు పెట్టి ఎమ్మెల్యే మీద కేసు నమోదు చేశామన్నారు. మాచర్ల నియోజకవర్గంలో ఈవీఎంల ధ్వంసం కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏ వన్ గా ఉన్నారు.
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడిపై మొత్తం 3 చట్టాల పరిధిలో 10 సెక్షన్లతో కేసులు పెట్టారు ఐపీసీ, ఆర్పీ, పీడీపీపీ చట్టాల పరిధిలో 10 సెక్షన్లు నమోదు చేశారు. ఐపీసీ కింద 143, 147, 448, 427, 353, 452, 120బి సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పిన్నెల్లిపై పీడీపీపీ చట్టం కింద మరో కేసు నమోదు కూడా నమోదు చేశారు. పిన్నెల్లిపై ఆర్పీ చట్టం 131, 135 సెక్షన్లతో కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం తొమ్మిది చోట్ల ఈవీఎంలను ద్వంసం చేస్తే అందులో ఏడు ఘటనలు మాచర్లలోనే జరిగాయి. ఏడింటిలోనూ ఎమ్మెల్యే పాత్ర ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు. ఈ ఫుటేజీలన్నిటినీ ప్రత్యేక దర్యాప్తు బృందాలకు పోలీసులు అందించారు.