Annavaram ratnagiri Pradakshana : అన్నవరంలో కన్నులపండువగా రత్నగిరి ప్రదక్షణ..! | DNN | ABP Desam

Continues below advertisement

అన్నవరంలో కన్నుల పండువగా వీరవెంకట సత్యనారాయణ స్వామి గిరి ప్రదక్షణ జరిగింది. రత్నగిరి కొండపై కార్తిక పౌర్ణమి రోజున భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. గ్రహణం ఉండటం వలన తెల్లవారుజామున 5 గంటలకు ప్రారంభమైన గిరి ప్రదక్షణ పదిగంటల వరకూ జరిగింది. కొండ చుట్టూ భక్తులు చెప్పులు ధరించకుండా దాదాపు ఎనిమిది కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేశారు. లక్ష ఇరవై నుంచి లక్ష యాభై వేల మంది వరకూ భక్తులు హాజరై ఉండొచ్చని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram