Anganwadis Different Protest Against CM Jagan: వినూత్నంగా నిరసన తెలిపిన అంగన్వాడీలు
రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న అంగన్వాడీ కార్యకర్తల సమ్మె 21వ రోజులు పూర్తి చేసుకుంది. సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ రాజోలులో అంగన్వాడీలు వినూత్న నిరసన చేపట్టారు. ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలకు ఇచ్చిన చీరకు, సెల్ ఫోన్ కు పూజలు చేశారు. 21 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.