AP Economy: అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆథోగతికి జారిపోతున్న ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ రెండేళ్ల నుంచి చర్చనీయాంశంగానే ఉంది. పరిస్థితి తాజాగా అదుపు తప్పిపోయిందన్న అభిప్రాయం ఆర్థిక శాఖ అధికారుల్లోనూ బలంగా వినిపిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లోనే బడ్జెట్ అంచనాలకు మించి ఆర్థిక లోటు ఏకంగా 662 శాతం అధికంగా నమోదైంది. అది అసాధారణం. ఇలాంటి పరిస్థితిలో వ్యవస్థ కుప్పకూలడం మినహా ఎలాంటి పరిస్థితుల్లోనూ మళ్లీ నిలబెట్టే అవకాశం ఉండదని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.