Andhra Pradesh: రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ డీలర్ల ఆందోళన
Continues below advertisement
గోనె సంచులకు డబ్బులు ఇస్తామని నమ్మించి ఏపీ ప్రభుత్వం మోసం చేసిందని రేషన్ డీలర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేశారు. రేషన్ పంపిణీ నిలిపివేసి నిరసనలో పాల్గొన్నారు. ఇప్పటికే నష్టాల్లో కొట్టుమిట్టాడుతుంటే ప్రభుత్వమూ తమను మోసం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో గోనె సంచుల్ని డీలర్లే అమ్ముకునేవాళ్లు. ఇప్పుడు వాటిని ప్రభుత్వమే వెనక్కి తీసుకుంటోంది. వాటికి డబ్బులు ఇస్తామని మాట ఇచ్చింది. ఇప్పుడు మాట మార్చటంతో జీవో నెంబర్ 10 రద్దు చేయాలని డీలర్లు డిమాండ్ చేశారు. ప్రభుత్వమే మోసం చేస్తే తమ గోడు ఎవరితో చెప్పుకునేదని నెల్లూరు జిల్లా డీలర్లు ఆవేదన వ్యక్తం చేశారు.
Continues below advertisement