Deputy CM Pawan Kalyan Convoy: డిప్యూటీ సీఎం పవన్ కు Y+ కేటగిరీ భద్రత
Download ABP Live App and Watch All Latest Videos
View In AppAndra Pradesh News: హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేరుకున్నారు. ఈ సందర్భంగా అధికారులు స్వాగతం పలికారు. అనంతరం.. ఆయన సీఎం క్యాంప్ ఆఫీస్ కు బయలుదేరారు.
2008లో రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కల్యాణ్ తొలిసారిగా ఎమ్మెల్యేగా విజయం సాధించారు. సచివాలయంలో అడుగు పెట్టనున్నారు. 2024 ఎన్నికల్లో కూటమి తరపున జనసేన అభ్యర్థిగా పిఠాపురం నుంచి భారీ మెజార్టీతో విజయం సాధించిన పవన్ కల్యాణ్‌కు మంత్రి పదవి వరించింది. చంద్రబాబు ప్రభుత్వంలో పవన్ ఉప ముఖ్యమంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఆయనకు గ్రామీణాభివృద్ధి, పంచాయతీ, అటవీ, సైన్స్ టెక్నాలజీ శాఖలను చంద్రబాబు అప్పగించారు.
ఈ శాఖలన్నీ తన మనసుకు చాలా దగ్గరగా ఉన్నవని పవన్ కల్యాణ్ ఇప్పటికే స్పందించారు. వాటికి పూర్తి స్థాయిలో న్యాయం చేయడంతోపాటు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. తనపై నమ్మకం ఉంచి ఇంతటి బృహత్ బాధ్యతను అప్పగించిన చంద్రబాబుకు కృతజ్ఞతలు చెప్పారు.