Daughter Kills Her Father At Madanapalle | ప్రియుడి మోజులో కన్న తండ్రిని చంపిన కూతురు

పెళ్లి చేసుకోమని తండ్రి ఒత్తిడి చేయడంతో... కన్న తండ్రినే కూతురు హత్య చేసింది. ఈ ఘటన అన్నమయ్య జిల్లా మదనపల్లిలో జరిగింది. ఈ ఘటనలో ఏం జరిగిందో క్లారిటీగా పోలీసుల మాటల్లోనే తెలుసుకోండి..!

తండ్రి ప్రభుత్వ ఉద్యోగి, కుమార్తెను ఆ స్థాయిలోనే చదివించాడు. మంచి వ్యక్తి చేతిలో పెట్టి తల్లిలేని బిడ్డను జాగ్రత్తగా సాగనంపాలని చూశాడు. చెడు తిరుగుళ్లకు అలవాటు పడిన ఆ యువతి మాత్రం అందుకే ఒప్పకోలేదు. అప్పుడే నాకు పెళ్లి ఏంటీ అంటూ తిరగబడింది. తండ్రి చెప్పిన మాటలు రుచించలేదామెకు. అంతే కోపంతో చేతికి ఏది దొరికితే దాంతో కొట్టి చంపేసింది. చివరకు కాలు జారి పడిపోయారని నాటకమాడింది. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఈనెల 13న ఈ దారుణం జరిగింది. కంటికి రెప్పలా కాపాడిన తండ్రినే కడతేర్చిన క్రిమినల్ కుమార్తె కథ ఇది. పీఅండ్‌టీ కాలనీలో ఉంటున్న దొరస్వామికి 62 ఏళ్లు. ఎస్జీటీ టీచర్‌గా పని చేస్తున్నాడు. ఏడాదిన్నర క్రితమే భార్య చనిపోయారు. వీళ్లకు ఒక్కగానొక్క కుమార్తె. పేరు హరిత. ఆమెను బీఎస్సీ బీఈడీ వరకు చదివించారు. కుమార్తె పెళ్లి కోసం డబ్బులు కూడా కూడబెట్టారు. నగలు కూడా కొనిపెట్టారు. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola