Ancient Anjaneya Swamy Temple in Tirupati | 1422 నాటి ఆంజనేయస్వామి, ఒంటె వాహన ఆలయం
తిరుమల యాత్రలో భాగంగా శ్రీనివాస మంగాపురం నుంచి శ్రీవారి మెట్టు కు వెళ్లే మార్గంలో శ్రీ భక్తాంజనేయ స్వామి వారు దర్శనం ఇస్తారు. ఇక్కడ ఆంజనేయ స్వామి వారిని, ఒంటె వాహనాన్ని 1422లో సాళ్వ వంశానికి చెందిన రాజులు ప్రతిష్టించారు. తిరుమలకు కల్యాణి డ్యామ్ నుంచి నీటిని పంపేందుకు పైపు లైన్లు ఏర్పాటు చేసేందుకు విగ్రహాన్ని తీసి పక్కన పెట్టారు. పనులు పూర్తి అయ్యాక నీరు ఆలయం వరకు వచ్చి నిలిచిపోయేది. ఎన్నిసార్లు అదే పరిస్థితి ఎదురవ్వడంతో పనులు చేసినా ఎల్ అండ్ టీ కంపెనీ వారు తిరుమలకు నీరు చేరుకుంటే ఆలయ నిర్మాణం చేస్తామని స్వామి వారిని ప్రార్ధించారు.
తిరుమల యాత్రలో భాగంగా శ్రీనివాస మంగాపురం నుంచి శ్రీవారి మెట్టు కు వెళ్లే మార్గంలో శ్రీ భక్తాంజనేయ స్వామి వారు దర్శనం ఇస్తారు. ఇక్కడ ఆంజనేయ స్వామి వారిని, ఒంటె వాహనాన్ని 1422లో సాళ్వ వంశానికి చెందిన రాజులు ప్రతిష్టించారు. తిరుమలకు కల్యాణి డ్యామ్ నుంచి నీటిని పంపేందుకు పైపు లైన్లు ఏర్పాటు చేసేందుకు విగ్రహాన్ని తీసి పక్కన పెట్టారు. పనులు పూర్తి అయ్యాక నీరు ఆలయం వరకు వచ్చి నిలిచిపోయేది. ఎన్నిసార్లు అదే పరిస్థితి ఎదురవ్వడంతో పనులు చేసినా ఎల్ అండ్ టీ కంపెనీ వారు తిరుమలకు నీరు చేరుకుంటే ఆలయ నిర్మాణం చేస్తామని స్వామి వారిని ప్రార్ధించారు. ఆ తరువాత నీరు తిరుమలకు వెళ్లిందని అర్చకులు చెబుతున్నారు. ఈ ఆలయం స్థానిక భక్తుల పర్యవేక్షణలో కొనసాగుతోంది. హనుమంతుల వారికి ఒంటె వాహనం అనేది చాలా అరుదుగా కనిపించే దర్శనం. ఇక్కడ దర్శనం ఇవ్వడం ప్రత్యేకతగా చెబుతారు.