సమస్యలు పరిష్కరించేవరకూ పోరాటం కొనసాగిస్తాం
సమస్యలు పరిష్కరించేవరకూ తమ ఆందోళనలను కొనసాగిస్తామని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం మొండి వైఖరిని నిరసిస్తూ నల్ల బ్యాడ్జీలతో హాజరైన ఉద్యోగులు.....తమ హక్కులను సాధించుకునేవరకూ ఉద్యమిస్తామన్నారు. దశలవారీగా ఉద్యమాన్ని తీవ్రతరం చేసేందుకు ప్రణాళికలు వేస్తున్నామంటున్న ఉద్యోగ సంఘాల నేతలు...తమ ఆందోళనలను ప్రజలు అర్థం చేసుకుంటారని వారి మద్దతుందని చెబుతున్నారు.