SK University Protest: అనంతపురం ఎస్కేయూలో వైఎస్సార్ విగ్రహావిష్కరణ, వర్సిటీ నిధులు వాడారంటూ విద్యార్థుల ఆందోళన

SK University Protest: అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో వైఎస్సార్ విగ్రహావిష్కరణ ఉద్రిక్తతకు దారితీసింది. వర్సిటీలో రాజకీయ నాయకుల విగ్రహావిష్కరణ ఎలా చేస్తారంటూ పలువురు విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. ఆవిష్కరణను అడ్డుకునే ప్రయత్నం చేయటంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులతో వారు వాగ్వాదానికి కూడా దిగారు. విగ్రహాన్ని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. తోపులాట జరగటంతో వారందర్నీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, ఎంపీ గోరంట్ల మాధవ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. విగ్రహానికి యూనివర్సిటీ నిధులు ఉపయోగించారన్న విమర్శలపై వైస్ చాన్సలర్ రామకృష్ణారెడ్డి స్పందించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola