Anantapur District Ministers in AP Cabinet | 14 మందిలో మంత్రులుగా ఛాన్స్ ఎంతమందికి | ABP Desam

రాష్ట్రవ్యాప్తంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించారు ఇందులో భాగంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో 14 నియోజకవర్గాలకు 14 స్థానాల్లో కూటమి నేతలు గెలుపొందారు ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి సీనియర్ నేతలు క్యాబినెట్లో చోటు తక్కుతుందా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి ఉరవకొండ ఎమ్మెల్యే టిడిపి సీనియర్ లీడర్ పయ్యావుల కేశవ్ చంద్రబాబు క్యాబినెట్లో మంత్రిగా అవకాశం కల్పిస్తుందని ఇప్పటికే టిడిపి శ్రేణులు పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతోంది ఇదే జిల్లా నుంచి మరో సీనియర్ నేత మాజీ మంత్రి పరిటాల సునీత కూడా అవకాశం లభిస్తుందని చర్చ కొనసాగుతుంది బీసీ సామాజిక వర్గం నుంచి కూడా మరి కొంతమంది నేతలు మంత్రి పదవి రేసులో ఉన్నారని తెలుస్తోంది ధర్మవరం నియోజకవర్గం నుంచి కూటమినేత బిజెపి అభ్యర్థి సత్యకుమార్ కూడా మంత్రివర్గంలో చోటు దక్కుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది మరో బిసి సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే కురువ సవితమ్మ కూడా మంత్రివర్గంలో చోటు దక్కుతుందని పెద్ద ఎత్తున కొనసాగుతోంది. టిడిపి సీనియర్ నేత మాజీ మంత్రి కాదా శ్రీనివాస్ కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో ఆయన కూడా ఈసారి మంత్రివర్గ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola