AP Rains: వరద ఉద్ధృతితో వాగులో పడిపోయిన లారీ

Continues below advertisement

అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలం దొరిగిల్లు వద్ద ఓ లారీ అదుపు తప్పి వాగులో పడింది. జిల్లెడువాగులో వరద ఉద్దృతి అధికంగా ఉండడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. కదిరి ప్రాంతంలో భారీ వర్షం కురవడంతో గొల్లపల్లి వద్ద శుక్రవారం ఓ కారు వాగులో కొట్టుకుపోయింది. ఈ ఘటనతో పులివెందుల-కదిరి మధ్య వాహన రాకపోకలకు నిలిచిపోయాయి. దీంతో దొరిగిల్లు మీదుగా పులివెందులకు వాహనాలు  వెళ్తున్నాయి. ఈ సమయంలో జిల్లెడువాగు దాటుతూ టెన్ టైర్ల లారీ ఒకటి అదుపు తప్పి పక్కకు పడింది. డ్రైవర్, క్లీనర్లు ప్రాణాలతో బయటపడ్డారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram