Anantapur AR Constable Prakash: ప్రకాష్ సైకిల్ యాత్రను అడ్డుకున్న పోలీసులు
విధుల నుంచి డిస్మిస్ అయిన అనంతపురం జిల్లా ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాష్.... మరోసారి వార్తల్లో నిలిచారు. నిన్న గాంధీ జయంతి సందర్భంగా.... సేవ్ ఏపీ పోలీసు నినాదంతో అనంతపురం ప్రెస్ క్లబ్ నుంచి సైకిల్ యాత్ర చేపట్టారు. దీన్ని పోలీసులు అడ్డుకుని ఆయనను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు బకాయిలుపడ్డ డీఏలు, అరియర్స్ ఇవ్వాలని ప్రకాష్ డిమాండ్ చేశారు.